అసెంబ్లీకి రాని ప్రజాప్రతినిధులపై చర్యలు ఎప్పుడు?
- ప్రజాస్వామ్యానికి అద్దంలా ఖాళీ కుర్చీలు- బాధ్యతలకే బ్రేక్ పడుతోందా?జనవరి 22 (ప్రజాప్రతినిధి శ్రీనివాస్):ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. ఎన్నికల సమయంలో తమ సమస్యలను, ఆశలను ప్రతినిధులుగా సభలో వినిపిస్తారనే నమ్మకంతో ప్రజలు ఓటు హక్కును వినియోగిస్తారు. కానీ ఇటీవలి కాలంలో అసెంబ్లీ సమావేశాలకు ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ప్రజా సమస్యలపై వాదనలు జరగాల్సిన సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం, శాసన వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.ప్రజాప్రతినిధి అనేది హోదా కాదు, బాధ్యత. శాసనసభకు హాజరు...