మనప్రజాప్రతినిధి//తోగుట,జనవరి10:
నూతన ఒరవడుల బాటలో
నాయకత్వ దీపం వెలిగించిన వాడు రామస్వామి.
నాయకుడవ్వాలనే తపనకంటే
మాటకు కట్టుబడే నిబద్ధతే గొప్పదని
సమయస్ఫూర్తితో అడుగులు వేసి
సేవనే జీవన వ్రతంగా మలచుకున్నాడు.
నిరుపయోగంగా నిశ్శబ్దంలో మునిగిన
స్మశాన వాటికను గమనించి
ప్రజాపయోగపు పవిత్రతను
మళ్లీ ఆ ప్రాంగణానికి ప్రసాదించాడు.
ఇచ్చిన మాటే అతని సంకల్పం,
చేసిన పనే అతని సాక్ష్యం—
సేవాభావానికి నిలిచిన
సజీవ ప్రతిరూపం రామస్వామి.
సమాజ హితమే మార్గమై,
సేవే లక్ష్యమై
ఇలాంటి మనసును ప్రతి ఒక్కరూ
అలవరుచుకోవాలని హృదయపూర్వక పిలుపు.