manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 12:13 pm Posted by : Mana Praja Prathinidhi

మరణానంతరం కూడా సేవే లక్ష్యంగా… గ్రామానికి వైకుంఠ రథం బహూకరణ

వెన్నవరం యశోధ-శ్రీనివాస్ రెడ్డి దంపతుల ఆదర్శ కార్యక్రమం
మనప్రజాప్రతినిధి//నర్సాపూర్.జనవరి26
వెల్దుర్తి మండల కేంద్రంలో మానవీయ విలువలకు ప్రతీకగా నిలిచే కార్యక్రమం జరిగింది. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి తండ్రి కీ.శే. వెన్నవరం వెంకట్ రెడ్డి జ్ఞాపకార్థంగా యశోధ – శ్రీనివాస్ రెడ్డి దంపతులు వెల్దుర్తి గ్రామ పంచాయతీకి వైకుంఠ రథాన్ని బహుకరించారు.గ్రామంలో మరణించినవారిని దహన సంస్కారాలకు తరలించే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన వారు, తండ్రి జ్ఞాపకార్థంగా ప్రత్యేకంగా రూ.1,65,000 వ్యయంతో వైకుంఠ రథాన్ని తయారు చేయించి గ్రామానికి అందజేశారు. ఈ సేవా కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండెం ఆదర్శ్, ఉపసర్పంచ్ కమ్మరి శ్రవణ్ కుమార్, ఈవో బలరాం రెడ్డి, వార్డు మెంబర్లు శాకారం శ్రీనివాస్ గౌడ్, కోదండ కృష్ణ గౌడ్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, జెగ్గా అశోక్ గౌడ్, శేఖర్ గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అంగడి పేట శ్రీనివాస్ గౌడ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.సేవా భావమే నిజమైన నివాళి అని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించింది.