మరణానంతరం కూడా సేవే లక్ష్యంగా… గ్రామానికి వైకుంఠ రథం బహూకరణ
•వెన్నవరం యశోధ-శ్రీనివాస్ రెడ్డి దంపతుల ఆదర్శ కార్యక్రమంమనప్రజాప్రతినిధి//నర్సాపూర్.జనవరి26వెల్దుర్తి మండల కేంద్రంలో మానవీయ విలువలకు ప్రతీకగా నిలిచే కార్యక్రమం జరిగింది. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి తండ్రి కీ.శే. వెన్నవరం వెంకట్ రెడ్డి జ్ఞాపకార్థంగా యశోధ – శ్రీనివాస్ రెడ్డి దంపతులు వెల్దుర్తి గ్రామ పంచాయతీకి వైకుంఠ రథాన్ని బహుకరించారు.గ్రామంలో మరణించినవారిని దహన సంస్కారాలకు తరలించే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన వారు, తండ్రి జ్ఞాపకార్థంగా ప్రత్యేకంగా రూ.1,65,000 వ్యయంతో వైకుంఠ రథాన్ని తయారు చేయించి గ్రామానికి అందజేశారు. ఈ సేవా...