•చందాయిపేట్‌లో మహిళాసంఘాల ఆధ్వర్యంలో శాలువాలతో సత్కారం
మెదక్ జిల్లా,చేగుంట.జనవరి14(మనప్రజాప్రతినిధి)
చేగుంట మండలం చందాయిపేట్ గ్రామంలో నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ పాలకవర్గానికి గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యం లో ఘనమైన సన్మాన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గ్రామాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం ఎంత కీలకమోఈకార్యక్రమం మరోసారి చాటింది.సీఏ కవిత, వీఓ రమ్య, మహిళా సంఘం అధ్యక్షురాలు బోనాల జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, పారదర్శకతతో గ్రామ పాలన కొనసాగించాలని మహిళా సంఘాల నాయకులు సూచించారు.ఈ సందర్భంగా సర్పంచ్ తాలూకా మహేశ్వరి సాయిబాబా, ఉపసర్పంచ్ పబ్బ నగేష్ గుప్తా మాట్లాడుతూ మహిళా సంఘాలు గ్రామ అభివృద్ధికి పునాది లాంటివని ప్రశంసించారు. గ్రామ సమస్యల పరిష్కారంలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేస్తూ, ప్రతి ఇంటి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశుభ్రత, విద్య, మహిళా సాధికారత దిశగా పాలకవర్గం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని వారు హామీ ఇచ్చారు. మహిళా సంఘాల సహకారంతో చందాయిపేట్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సాయిబాబా, సూరం రమ్య, మంగలి మమత, మంగలి అరుణ, చిట్టబోయిన సునీత, తాలూకా యాదమ్మతో పాటు గ్రామ వార్డు సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.