manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 8:34 am Editor : MANA PRAJA PRATINIDHI

మహిళల ఆర్ధికాభివృద్ధికి కృషి

7వ వార్డు అభ్యర్థి విజయ్
మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 31:

ఖేడ్ మున్సిపాలిటీలోని 7వ వార్డులోని మహిళల ఆర్ధికభివృద్ధికి కృషి చేస్తానని బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి విజయ్ బుజ్జి అన్నారు. శనివారంఆయనఒకప్రకటనలోపేర్కొంటూ..మున్సిపాలిటీలోని 7వ వార్డులో గల మహిళలు అందరు ఆర్థికంగా ఎదగడానికి,ఆర్ధిక అవసరాల కోసం ఇతరులు మరియు కుటుంబ సభ్యులపై ఆధారపడకుండ ఉండడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాను అన్నారు.అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తాను అన్నారు.ఇంతకుముందు తనకు ఎటువంటి పదవి లేకున్న లక్షలాది రూపాయలు వెచ్చించి మాజీ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బెంచీలు,హై మాస్ట్ లైట్లను ఏర్పాటు చేశానని,ఎంతోమంది ఆర్ధిక సహాయం కూడ చేశారు.వార్డులో అందరితో కలుపుగోలుగా ఉంటూ, సేవా కార్యక్రమాలు నిర్వహించే తనకు 7వ కౌన్సిలర్ గా గెలిపించాలి అన్నారు.