యోగి వేమన పద్యాలు జీవిత సత్యాలకు అద్దం
- వేమన జయంతి సందర్భంగా ఒక ఆలోచనాత్మక వ్యాసంగంజాయి శ్రీనివాస్ జనవరి 19 : (మనప్రజాప్రతినిధి)యోగి వేమన పద్యాలు కేవలం సాహిత్య సృష్టులు మాత్రమే కాదు. అవి మనిషి అంతరంగాన్ని తడిమి, అతని జీవన ప్రయాణానికి దారి చూపే జీవన సూత్రాలు. శతాబ్దాల క్రితమే సమాజాన్ని గమనించి, మానవ స్వభావంలోని ద్వంద్వాలను ప్రశ్నించి, నిజమైన మార్పు ఎక్కడి నుంచి రావాలో స్పష్టంగా చెప్పిన మహనీయుడు యోగి వేమన.“మేడిపండు చూడ మేలిమైయుండు” అనే పద్యం ద్వారా వేమన బాహ్య ఆడంబరాలకు లోనవ్వవద్దని హెచ్చరిస్తాడు. బయటకు మెరిసే...