manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 5:49 am Editor : Mana Praja Prathinidhi

యువతక్రీడల్లో ప్రతిభను కనబరచాలి :సర్పంచ్ కవితవిట్ఠల్

ముప్పారంలో క్రికెట్ టోర్నీ ప్రారంభం
మెదక్,జనవరి17(మనప్రజాప్రతినిధి)
యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలంటే క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని ముప్పారం గ్రామ సర్పంచ్ కవిత విట్ఠల్ అన్నారు.ఈ సందర్భంగా ముప్పారం గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను సీనియర్ నాయకులు సుబాష్ రావు ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ, యువత చిన్న వయస్సు నుంచే చదువుతో పాటు క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతలో ఉత్సాహం పెంచేందుకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శేషారెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు నాగప్ప, ఆంజనేయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు