మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్31
శ్రీకాళహస్తిలోని శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కళాశాల చైర్మన్‌ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అక్షయ్ కుమార్మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తీర్థప్రసాదాలను కళాశాల చైర్మన్‌కు అందజేశారు.కళాశాలలో ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించిన అక్షయ్ కుమార్, ఇదే విధంగా భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని చైర్మన్‌ను కోరారు. విద్యాభివృద్ధికి పాలిటెక్నిక్ కళాశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ లెక్చరర్ బాపట్ల రమేష్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగ హెచ్‌ఓడి ప్రతాప్, మెకానికల్ విభాగ హెచ్‌ఓడి సిద్దిరాజు తో పాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.