manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 2:55 am Editor : Mana Praja Prathinidhi

నూతన సంవత్సర సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను కలిసిన వైఎస్ఆర్సిపి నాయకులు

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.జనవరి1
నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకొని శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు ప్రముఖ నేతలను మర్యాదపూర్వకంగా కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల తంగళ్ బాలాజీ ప్రసాద్ రెడ్డి, ఏర్పేడు మండల ఇంచార్జ్ గిన్నేరు కిషోర్ రెడ్డి, పవిత్ర రెడ్డిలను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల నాయకులు మండల అధ్యక్షులు రమణయ్య యాదవ్, మండల ఉపాధ్యక్షులు ముని కృష్ణారెడ్డి, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ నాగార్జున రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు కేశవులు రెడ్డి, సీనియర్ నాయకులు ఏ.గురునాథం, చెంగల్ రాయలు, రాజుల కండిగ రమేష్, యువ నాయకులు వినోద్, లోకేష్ యాదవ్, కొత్త వీరాపురం చిన్న అంజిమేడు, శివ తదితరులు పాల్గొన్నారు.నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాలపై నాయకుల మధ్య స్నేహపూర్వకంగా చర్చ జరిగినట్లు తెలిపారు.