సంక్షేమం పేరుతో బలహీనమవుతున్న భవిష్యత్తు

గంజాయి శ్రీనివాస్,ఫిబ్రవరి 2 (మనప్రజాప్రతినిధి): దేశవ్యాప్తంగా రాజకీయాలు, ఎన్నికలు, ప్రభుత్వ విధానాల మధ్య ఒక పదం ఎప్పుడూ చర్చలో ఉంటుంది. “ఉచిత పథకాలు”. పేదలకు అండగా నిలవడం, అసమానతలను తగ్గించడం అనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకాలు, నేడు సమాజాన్ని నిజంగా ముందుకు నడిపిస్తున్నాయా? లేక నెమ్మదిగా అలవాటుగా మారి ప్రజలను ఆధారపడే పరిస్థితికి నెట్టుతున్నాయా? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.సంక్షేమ రాజ్యం అనే భావనలో ఉచిత పథకాలకు ఒక నైతికత ఉంది. ఆకలి, నిరుద్యోగం, విద్యా లోపం వంటి సమస్యలతో బాధపడే వర్గాలకు...