manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 11:07 am Editor : Mana Praja Prathinidhi

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి 5రోజుల జైలు శిక్ష..

మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు-రూరల్ ఎస్సై రాజేష్ హెచ్చరిక
మనప్రజాప్రతినిధి//సిద్ధిపేటనియోజకవర్గం,ఫిబ్రవరి6
సిద్ధిపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. రూరల్ ఎస్సై రాజేష్ సమక్షంలో ప్రత్యేకంగా చేపట్టిన తనిఖీలలో బాసంపల్లినరేష్(35),తండ్రి బ్రహ్మయ్య, మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులు పట్టుకున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, నిందితుడికి ఐదు రోజుల కస్టడీ జైలు శిక్ష విధించినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ, ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ప్రాణనష్టంనివారించలేని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.