రూ.10లక్షల విరాళంతో పాఠశాలకు చేయూత-డా.కుసుమ విట్టల్ సేవాభావానికి ప్రశంసలు
•తాను చదివిన కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలకు భారీ విరాళం-పేద విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాటమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి07పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, ప్రభుత్వ పాఠశాలలో చదివి కష్టసాధ్యమైన ప్రయాణం ద్వారా అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిన డా.కుసుమ విట్టల్ మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు.తాను చదువుకున్న సిరిసిల్లలోని కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలకు రూ.10 లక్షల విరాళం అందజేసి పేద విద్యార్థుల భవిష్యత్తుకు చేయూతనిచ్చారు.ఈ విరాళం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థుల విద్యాఅవసరాలు మౌలిక వసతులు మరియు ప్రతిభాభివృద్ధి కార్యక్రమాలకు...