manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 1:47 pm Editor : Mana Praja Prathinidhi

చిరుపై అభిమానాన్ని గర్జనలా చాటిన అభిమానుల పాట

•రేణుక చిరు చేతుల మీదుగా ఆవిష్కరణ… ప్రజాసేవకు ఘన ప్రశంసలు
సదాశివపేట,ఫిబ్రవరి4(మనప్రజాప్రతినిధి)
మూడవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేణుక చిరుపై అభిమానాన్ని పాట రూపంలో ఆవిష్కరించిన ఘట్టం సదాశివపేటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరుపై ఉన్న అపారమైన ప్రేమను చాటేలా రూపొందించిన ఈ పాట ఆడియోను చిరు స్వయంగా చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ, చిరు లాంటి యువత రాజకీయాల్లో ఉండటం కాలానుగుణ అవసరమని అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ, వార్డులో ఏ సమస్య ఎదురైనా తన సొంత నిధులతోనైనా పరిష్కరించే తత్వం చిరుకు ఉందని కొనియాడారు. యువతకు ఆదర్శంగా నిలిచే వ్యక్తి చిరు అని, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ప్రజాసేవ మరింత వేగవంతమవుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సద్దాం, సాజీద్, ఖదీర్, సలీం, తయ్యబు, హైమాద్, నాని, ఎజాస్, లడ్డు, రియాజ్, సర్వార్ తదితర అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని చిరుపై తమ అపారమైన అభిమానాన్ని ఘనంగా వ్యక్తపరిచారు.