ప్రజల సమస్యల పరిష్కారానికి సాంకేతిక వేదిక – 10వ వార్డులో వాట్సాప్ గ్రూప్ ప్రారంభించిన కెంబసారి మల్లేశం
•హామీల అమలుకు కార్యాచరణ ప్రారంభం – ప్రజల సమస్యలపై వెంటనే స్పందన •వార్డు అభివృద్ధికి వేగం-సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్•ప్రజలతో నేరుగా కమ్యూనికేషన్-అభివృద్ధి పనుల అమలుకు మల్లేశం కట్టుబాటు (మనప్రజాప్రతినిధి),దౌల్తాబాద్ మండలం.ఫిబ్రవరి06దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో నూతన సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో 10వ వార్డు సభ్యుడిగా గెలుపొందిన కెంబసారి మల్లేశం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించారు. ప్రజల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకుని వార్డులో అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.వార్డులో శుభ్రత నిర్వహణ, తాగునీటి...