manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 4:55 pm Editor : Mana Praja Prathinidhi

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు ఘనసన్మానం-పులిమామిడి మమత రాజు

సదాశివపేట,ఫిబ్రవరి17(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట పట్టణంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించడానికి అహర్నిశలు కృషి చేసిన నాయకుల ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు.12వ వార్డు నుండి కౌన్సిలర్‌గా గెలుపొందిన పులిమామిడి మమత ఘనంగా సన్మానించారు.ఎన్నికల ఇంచార్జ్ చెర్యాల అంజన్న, టీజీసీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి పటేల్, మండల అధ్యక్షుడు చాట్ల సిద్దన్న, రేజింతల్ సర్పంచ్ ఆశిరెడ్డి, ఆత్మకూర్ సర్పంచ్ వడ్ల నిఖిత బింబాధర్ చారి తదితరులను 12వ వార్డు ప్రజల సమక్షంలో శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ, సదాశివపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ 16 సీట్లు గెలుచుకోవడం కార్యకర్తల కష్టఫలమని అన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, పి.ఎం.ఆర్ యువసేన నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు