manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 10:50 am Editor : Mana Praja Prathinidhi

గ్రామ ఆరోగ్య రంగంలో మరో మైలురాయి

మెడికల్ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించిన మామిడి రాజు
మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి16
ఇల్లంతకుంట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసినప్రశాంత్ మెడికల్ జనరల్ స్టోర్&లేబొరేటరీస్ ఘనంగా ప్రారంభమైంది.ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ మామిడి రాజు మరియు ప్రముఖ వైద్యులు డా. వెన్నమనేని జగన్ మోహన్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ-“గ్రామ ప్రజలకు నాణ్యమైన ఔషధాలు, సమయానుకూల ల్యాబ్ పరీక్షలు అందుబాటులోకి రావడం ఆరోగ్య విప్లవానికి నాంది. ఇకపై చిన్నపాటి అనారోగ్య సమస్యలకైనా పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ప్రజలకు సౌకర్యం కలగడం ఆనందకరం”అని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల విస్తరణ ప్రజల ఆరోగ్య భద్రతకు బలమైన పునాది వేస్తుందని, వ్యాపారవేత్త ప్రశాంత్ సేవా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మామిడి శ్రీను, అంతటి శ్రీకాంత్ గౌడ్, కందికట్కూరు మాజీ సర్పంచ్ పెండ్యాల వెంకట్ రెడ్డి, బాబు, మోజెష్, ప్రశాంత్, అంజయ్య తదితర గ్రామ పెద్దలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.గ్రామ అభివృద్ధి – ప్రజా ఆరోగ్యం – సేవా సంకల్పం… ఇదే ఇల్లంతకుంట కొత్త దిశ!