manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 2:01 pm Editor : Mana Praja Prathinidhi

రైతు సంక్షేమంలో మరో ముందడుగు

•ఎంఆర్వో భార్గవి చేతుల మీదుగా రైతులకు పాస్ బుక్కుల పంపిణీ
•భూ రికార్డుల్లో పారదర్శకతకు బాటలు…డిజిటల్ పాస్ బుక్స్ పంపిణీఏర్పేడు మండలంలో డిజిటల్ పాస్ బుక్కుల పంపిణీ… వెంకటాపురం రైతులకు లబ్ధి
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.ఫిబ్రవరి02
రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డిజిటల్ పాస్ బుక్ విధానం ఏర్పేడు మండలంలో వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం సీతారాంపేట పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన రైతులకు ఎంఆర్వో కార్యాలయం వద్ద డిజిటల్ పాస్ బుక్కులను ఎంఆర్వో శ్రీమతి భార్గవి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు పేరం ధనంజయులు నాయుడు, నైనూరు పున్నారావు, శివశంకర్ రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ మహేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అలాగే సూరి నాయుడు, బాబు నాయుడు, క్రిష్ణవేణి, రాఘవేంద్ర, గుణా యాదవ్, రాచటి సుబ్రహ్మణ్యం, కేశినేని సుబ్రహ్మణ్యం, నాగేశ్వరావు, శీను, వెంకటయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, మనోహర్ నాయుడు తదితరులు పాల్గొని రైతులకు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, డిజిటల్ పాస్ బుక్కుల ద్వారా భూ రికార్డుల్లో పారదర్శకత పెరిగి రైతులకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.