బీటెక్ విద్యార్థి బలవన్మరణం-ఆర్థిక ఇబ్బందులు కారణమా?

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా,ఫిబ్రవరి18కుటుంబ ఆర్థిక ఇబ్బందులు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్న విషాద ఘటన బోయినపల్లి మండలం దుబ్బపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన యువకుడు ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దుబ్బపల్లి గ్రామానికి చెందిన రామంచ సంజయ్ (18) హైదరాబాద్లోని అవంతి కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో సకాలంలో కళాశాల ఫీజులు చెల్లించలేకపోయాడు. దీనికి తోడు ఇంట్లో అక్క వివాహం వంటి ఇతర ఆర్థిక బాధ్యతలు కూడా...