ఇల్లంతకుంటలో బీజేపీ శక్తి ప్రదర్శన-కరీంనగర్ విజయంపై ఘన సంబరాలు

మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి16:ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శ్రేణులు భారీ సంబరాలతో శక్తి ప్రదర్శన చేశాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకున్న సందర్భంగా మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేస్తూ కార్యకర్తలు విజయోత్సాహాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భూమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ, అధికార బలం.డబ్బు బలం మధ్య జరిగిన పోటీలో ప్రజల విశ్వాసం బీజేపీపై నిలిచిందని, ప్రజల ఆశీస్సులతో కరీంనగర్ మేయర్ పదవిని పార్టీ సాధించిందని తెలిపారు. అధికార పార్టీ...