కొండాపూర్ పెద్దమ్మ ఆలయంలో సీసీ కెమెరాల ప్రారంభం

•నేరాల నియంత్రణలో ‘మూడవ కన్ను’గా సీసీ కెమెరాలు-చందుర్తి సీఐ వెంకటేశ్వర్లుమనప్రజాప్రతినిధి//కోనరావుపేట,ఫిబ్రవరి07:రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో వెలసిన పెద్దమ్మ దేవాలయంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను శనివారం చందుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. వెంకటేశ్వర్లు, కోనరావుపేట ఎస్ఐ కె. ప్రశాంత్ రెడ్డితో కలిసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు “మూడవ కన్ను”లా పనిచేస్తాయని తెలిపారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు నిందితులను...