manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 9:13 am Editor : MANA PRAJA PRATINIDHI

18 ఏళ్లలోపు పిల్లలతో ప్రచారం చేయించరాదు

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 6: భారత ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం ఎన్నికల ప్రచారంలో 18 ఏళ్లలోపు చిన్నపిల్లలను ఉపయోగిస్తే తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఎన్.ఉమాహారతి తెలిపారు.శుక్రవారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొంటూ..మున్సిపల్ఎన్నికల సందర్బంగా ఆయా పార్టీల అభ్యర్థులు చిన్న పిల్లలను ప్రచారంలో ఉపయోగించరాదు అన్నారు.రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లలను ర్యాలీలు, సభలు,పోస్టర్లు అంటించడం, కరపత్రాలు పంచడం లాంటివి చేయరాదు అన్నారు.రాజకీయ పార్టీల గుర్తులను ప్రదర్శించడం,పార్టీ జెండాలు పట్టుకుని నినాదాలు చేయించడం చట్ట విరుద్ధం అన్నారు. అదేవిధంగా నాయకులు ఎన్నికల ప్రచారంలో ఎత్తుకోవడం లేదా వాహనాలలో తీసుకెళ్లడం కూడా నిషేధం అన్నారు.ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అందుకోసం మున్సిపాలిటీలో ఎఫ్ఎస్టి టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.