manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 9:31 am Editor : MANA PRAJA PRATINIDHI

12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి షారుఖ్ ఖాన్ జోరుగా ఎన్నికల ప్రచారం

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 4:
నారాయణఖేడ్ మున్సిపాలిటీ 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షారుఖ్ ఖాన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకుని ఆశీర్వాదం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12వ వార్డులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, అంతర్గత రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను వార్డు స్థాయిలో సమర్థంగా అమలు చేస్తానని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు భద్రత, వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. అవకాశం ఇస్తే 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తూ, ప్రజలు తనకు ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి షారుఖ్ ఖాన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు పిలుపునిచ్చారు.