manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 5:45 pm Posted by : Mana Praja Prathinidhi

హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం-ప్రజలకు కృతజ్ఞతలు

హుస్నాబాద్.మనప్రజాప్రతినిధి//ఫిబ్రవరి13
హుస్నాబాద్ పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో అఖండ విజయం సాధించి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు. ఓట్ల లెక్కింపు అనంతరం విజయం సాధించిన కౌన్సిలర్లతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలకుధన్యవాదా లు తెలిపారు.ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలుప్రజా ప్రయోజనాలకు కట్టుబడి పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలుమరోసారి ఆశీర్వాదం అందించారని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్క సతీష్ కుమార్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు కాసోజు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ నేత, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు డప్పు రాజు, రాహుల్ గౌడ్, సురేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.