పశువులపై పంజా విసిరిన కుక్కలు – పేద కుటుంబానికి లక్షన్నర నష్టం

•జీవనాధారాన్ని చీల్చిన కుక్కల దాడి-ప్రభుత్వం ఆదుకోవాలంటూ బాధితుల విజ్ఞప్తి•కొట్టంలోనే కరాళ నృత్యం-30 గొర్రె,మేక పిల్లలు మృతి•పశువుల పెంపకదారుడికి భారీ దెబ్బ-కుక్కల దాడిలో జీవనాధారం నశనం మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఫిబ్రవరి6సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ గ్రామంలో కుక్కల దాడిలో సుమారు 30 గొర్రెలు, మేక పిల్లలు మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి సుమారు లక్షన్నర రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు.మర్పడ గ్రామానికి చెందిన పిండి నారాయణ గొర్రెలు, మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రతిరోజులానే ఉదయం జీవాలకు...