•మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్ష
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం,ఫిబ్రవరి6:
మహాశివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లాలోని ప్రముఖ శివాలయాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు,టిటిడిఎస్ఓమురళీకృష్ణ, టిటిడి జేఈవో వీరబ్రహ్మం సంయుక్తంగా ఉన్నతాధికారులతో కలిసి కపిలతీర్థం ఆలయం.అనుబంధ దేవాలయాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి సదుపాయం, క్యూలైన్ వ్యవస్థ వంటి అంశాలను అధికారులు ప్రత్యేకంగా పరిశీలించి సంబంధిత శాఖలకుఅవసరమైన సూచనలు చేశారు.అదే విధంగా శ్రీనివాస మంగాపురం, గుడిమల్లం తదితర ఆలయాల్లో కూడా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి రోజున భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా దర్శనం చేసుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి డీఎస్పీ రామకిషోర్‌తో పాటు టీటీడిపోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.