manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 3:04 pm Editor : Mana Praja Prathinidhi

అక్బర్‌పేట భూంపల్లి మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కమిటీ ఎన్నిక

గ్రామాభివృద్ధికి ఐక్యంగా పనిచేద్దాం – అధ్యక్షుడు పాలమాకుల రమేష్ గౌడ్ పిలుపు

మనప్రజాప్రతినిధి//అక్బర్పేట్ భూంపల్లిమండలం.ఫిబ్రవరి12

అక్బర్‌పేట భూంపల్లి మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మండల అధ్యక్షుడిగా పాలమాకుల రమేష్ గౌడ్ (రుద్రారం) ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా దోర్నాల యాదగిరి (చిట్టాపూర్), కోశాధికారిగా దమ్మగౌని ప్రవీణ్ గౌడ్ (పోతారెడ్డిపేట్), ప్రధాన కార్యదర్శిగా పాతురి నవీన్ గౌడ్ (తాళ్లపల్లి) ఎన్నికయ్యారు. సలహాదారుగా జీడిపల్లి రమేష్ (నగరం) ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు పాలమాకుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు కలసికట్టుగా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉపసర్పంచ్‌లు పాల్గొన్నారు.