ఉపాధి హామీ పనులను కొనసాగించాలి – సదాశివపేటలో కార్మిక సంఘం వినతి

•వి.బి.జి.రాంజీ చట్టం రద్దు చేసి ఉపాధి హామీ కొనసాగించాలి-తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ సదాశివపేట,ఫిబ్రవరి17(మనప్రజాప్రతినిధి):తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సదాశివపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఎంపీడీవో కొండా లక్ష్మి కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. నర్సిములు మాట్లాడుతూ, రేక్కాడితే గాని డొక్కాడని పేదల జీవనాధారం అయిన ఉపాధి హామీ పనులను బలహీనపరిచే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవా లని కోరారు. వి.బి.జి. రాంజీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ పేరు...