సదాశివపేట,ఫిబ్రవరి10(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట మండలంలోని తంగడపల్లి గ్రామంలో డీసీసీబీ ఆధ్వర్యం లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డీసీసీబీ బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్ ప్రవళిక మాట్లాడుతూ, మండలంలోని రైతులు బ్యాంక్ ఖాతాలు లేనివారు ఖాతాలు ప్రారంభించుకోవాలని, ఇప్పటికేఖాతాలు ఉన్న వారు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే వివిధ రకాల పోర్టల్స్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలపై రైతులకు అవగాహన కల్పించారు.సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పీఎంఎస్బీవై, పీఎంజేజేబీవై వంటి ప్రభుత్వ బీమా పథకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ రాజ్‌కుమార్, విలేజ్ సెక్రటరీ గీతాంజలి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.