లింగరాజుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి

(మనప్రజాప్రతినిధి)ఫిబ్రవరి20సిద్దిపేట జిల్లా లోని దౌల్తాబాద్ మండలం కేంద్రంలోని లింగరాజుపల్లి హాస్టల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు.గోవిందాపూర్ గ్రామానికి చెందిన ఉప్పల అశోక్ (26) రోజువారీగా సూరంపల్లి కోళ్ల ఫారంలో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం అతన్నిఢీకొనడం తో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న ఎస్సై అరుణ్ కుమార్ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు సేకరిస్తూ...