manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 2:10 pm Editor : Mana Praja Prathinidhi

పదవ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ – విద్యా ప్రోత్సాహానికి ముందుకొచ్చిన దాతలు

•విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి:ట్రస్మా జిల్లా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ గౌడ్
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి07
విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం సమాజంలోని దాతలు ముందుకు రావడం అభినందనీయమని ట్రస్మా జిల్లా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సిరిసిల్ల పట్టణం శివనగర్‌లోని కుసుమరామయ్య ఉన్నత పాఠశాలలో ఎస్.ఆర్. అకాడమీ సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు శనివారం ఉచిత స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సీఐ కృష్ణ మాట్లాడుతూ, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని సూచించారు. నాణ్యమైన స్టడీ మెటీరియల్ విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యా యులు మోతిలాల్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ బృందం విద్యార్థుల విజయం కోసం నిరంతరం శ్రమిస్తోందని, దాతల సహకారం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎస్.ఆర్. అకాడమీ ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
“విద్యే భవిష్యత్తుకు బలమైన పునాది_కష్టపడితే విజయం ఖాయం” అని విద్యార్థులకు సందేశం ఇచ్చారు