ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన హౌసింగ్ ఎండి వి.పి. గౌతమ్
•షేర్‌వాల్ టెక్నాలజీతో నాణ్యమైన ఇళ్లు-లబ్ధిదారులుసద్వినియోగం చేసుకోవాలిసదాశివపేట,ఫిబ్రవరి3(మనప్రజాప్రతినిధి)రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను హౌసింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ సదాశివపేట మండలం ఆరూరు గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం సందర్శించారు. గ్రామపంచాయతీ పరిధిలో షేర్‌వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా హౌసింగ్ ఎండి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన ఐదు లక్షల రూపాయల వ్యయ పరిమితిలోనే షేర్‌వాల్ టెక్నాలజీ ద్వారా నాణ్యమైన ఇళ్లను పూర్తిచేసి నిరుపేదలకు అందించనున్నట్లు తెలిపారు. ఇలాంటి అవకాశాన్ని లబ్ధిదారులందరూ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని గ్రామ ప్రజలకు...