మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కర్ణాటక వ్యక్తి నుంచి రూ.1.30లక్షల స్వాధీనం
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి02
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల నిబంధనల అమలు కోసం చేపట్టిన కఠిన తనిఖీల్లో భాగంగా సిరిసిల్ల సమీపంలోని తంగళ్లపల్లి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన SST (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్) చెక్‌పోస్ట్‌లో భారీగా నగదు పట్టుబడింది.సోమవారం ఉదయం సుమారు 11.46 గంటల సమయంలో చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, కర్ణాటక రాష్ట్రానికి చెందిన KA 40 N 4315 నంబర్ గల కారును పోలీసులు ఆపారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ఎలాంటి సరైన పత్రాలు లేకుండా రూ.1,30,000/- (లక్షాముప్పైవేలరూపాయలు)నగదు లభ్యమైంది.కారు డ్రైవర్. యజమానిని కర్ణాటక రాష్ట్రం జయప్పనల్లి గ్రామానికి చెందిన మోహిత్ కుమార్BS(తండ్రి: సుబ్బరామిరెడ్డి)గా పోలీసులు గుర్తించారు. ఈ నగదుతో జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామానికి వెళ్తున్నట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.ఎన్నికల నిబంధనల ప్రకారం సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో, SST బృంద ఇన్‌చార్జ్ శ్రీకాంత్, పంచుల సమక్షంలో ఆ నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ K. కృష్ణ తెలిపారు. నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఉద్దేశంతో తరలిస్తున్నారు? అనే అంశాలపై తదుపరి విచారణ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో భారీ మొత్తంలో నగదు తరలించే వారు తప్పనిసరిగా సంబంధిత పత్రాలు కలిగి ఉండాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.