manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 1:17 pm Editor : Mana Praja Prathinidhi

సిరిసిల్లలో భారీ నగదు సీజ్-ఎన్నికల తనిఖీల్లో రూ.2 లక్షలు స్వాధీనం..

•ఆధారాలు చూపలేకపోయిన వ్యక్తి వద్ద నగదు పట్టివేత…విచారణ కొనసాగింపు
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి07:
రాష్ట్రంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోపోలీసులు తనిఖీలను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ బృందం చెక్‌పోస్ట్ వద్ద రూ.2 లక్షల నగదు పట్టుబడింది.ఉదయం సుమారు 10:34 గంటల సమయంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు, జగిత్యాల నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న TS 21 5555 నంబర్ గల కారును ఆపి తనిఖీ చేశారు. కారును సోదా చేయగా లెక్క చూపని రూ.2,00,000 నగదు లభించింది.కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని జగిత్యాలకు చెందిన ఆనందుల శ్రీనాథ్ (తండ్రి: మురళి)గా గుర్తించారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో అధికారులు అనుమానాస్పదంగా భావించి పంచుల సమక్షంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై సిరిసిల్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. కృష్ణ మాట్లాడుతూ, నగదు ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే విషయాలపై విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున తగిన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదును వెంట తీసుకెళ్లకూడదని అధికారులు ప్రజలకు సూచించారు.