కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా ఒక్క అవకాశం ఇవ్వండి
– 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సతీష్ కుమార్ మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 6:నారాయణఖేడ్ మున్సిపాలిటీ 6వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సతీష్ కుమార్ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచి, వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. యువ నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలిసి ఆశీర్వాదం కోరిన సతీష్ కుమార్ మాట్లాడుతూ.. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక...