manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 5:41 am Editor : MANA PRAJA PRATINIDHI

కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అనంతు రాంబాబు

-సిట్‌ నోటీసులపై తీవ్ర ఆగ్రహం
-రాజకీయ వేధింపులకే కాంగ్రెస్‌ పాలన
అనంతు రాంబాబు  ప్రభుత్వానికి గట్టి ప్రతిఘటన హెచ్చరిక

నేరేడుచర్ల, ఫిబ్రవరి02: (మనప్రజాప్రతినిధి):

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భాగంగా కేసీఆర్ కు సిట్‌ విచారణ నోటీసులు ఇవ్వడాన్ని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతు రాంబాబు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని హెచ్చరించారు. ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ వేధింపుల్లో భాగమేనని ఆయన మండిపడ్డారు అనంతు రాంబాబు మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని అన్నారు. పాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వేధింపులను బీఆర్‌ఎస్‌ శ్రేణులు సహించబోవని స్పష్టం చేశారు.
కేసీఆర్‌ జోలికి వస్తే రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గట్టి ప్రతిఘటన ఎదురవుతుందని
అనంతు రాంబాబు హెచ్చరించారు. కేసీఆర్‌పై రాజకీయ వేధింపులు కొనసాగితే సూర్యాపేట జిల్లా నుంచే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.