ఉపాధి హామీని రద్దు చేస్తే గ్రామీణ ఉద్యమాలే: సీపీఐ హెచ్చరిక
•కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సిపిఐ ధర్నాలుమనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.ఫిబ్రవరి02కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తే తీవ్ర ఉద్యమాలు తప్పవని సిపిఐ నేతలు హెచ్చరించారు. సిపిఐ పార్టీ పిలుపుమేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి రూరల్, తొట్టంబేడు మండలాల్లో ధర్నాలు నిర్వహించి అనంతరం వినతిపత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ, గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పిస్తున్న ఉపాధి హామీ...