manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 10:09 am Editor : MANA PRAJA PRATINIDHI

ఆదరిస్తే అభివృద్ధి చేస్తా

-14వ వార్డు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్

మన ప్రజా ప్రతినిధి//సూర్యాపేట జిల్లా :-

రాబోయే సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో చెయ్యి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీ తో తనను గెలిపించాలని 14 వార్డు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ అన్నారు. మంగళవారం 14 వార్డులో ప్రచారం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ,ఎప్పుడు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమను ఆదరిస్తే పట్టణంలోని అన్ని వార్డులకంటే 14వ వార్డు ను ఆదర్శ వార్డు గా తీర్చిదిద్దుతా అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం లక్ష్మాజీ, వరిపెళ్ళి లక్ష్మయ్య, లింగంపల్లి సృజన్,శంకర్ రాజేష్,తదితరులు పాల్గొన్నారు.