నారాయణ ఖేడ్ లో జోరుగాఅక్రమ కల్తీ కల్లు అమ్మకాలు ఏనాడూ తనిఖీలు చేయని ఎక్సైజ్ అధికారులు

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి,02అధికారుల కనుసన్నల్లోనే కల్తీ కల్లు వ్యాపారాలు నారాయణ ఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో1,2 కల్లు దుఖానాలు కొనసాగుతున్నాయి. కేవలం వెళ్ళమీద లెక్కబెట్టే దుకాణాలకు మాత్రమే ప్రభుత్వం నుండి అనుమతులు ఉండగా మిగతావి అన్ని అక్రమ దుకాణాలే. అనుమతులు లేని దుఖానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో సంబంధిత అధికారులు,సిబ్బందికి తెలుసు అయినా చర్యలు తీసుకోవడం లేరు.మేము దాడులు చేస్తున్నామని చెబుతున్న ఎక్సైజ్ సిఐ రఘునాథ్ రెడ్డి మరి పట్టుకున్న విషయం ఏనాడు మీడియాకు చెప్పలేరు. అదేవిధంగా కల్తీ కల్లు పరీక్షల నిమిత్తం ల్యాబుకు పంపించామని...