manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 12:43 pm Editor : Mana Praja Prathinidhi

అహంకారానికి–అభిమానానికి మధ్య పోటీ కాదు… నమ్మకానికి–నిజాయితీకి మధ్యే విజయం : భవాని విశ్వనాథం

13వ వార్డులో విస్తృత ప్రచారంతో కాంగ్రెస్ అభ్యర్థికి పెరుగుతున్న మద్దతు
సదాశివపేట, ఫిబ్రవరి 4 (మన ప్రజాప్రతినిధి)
13వ వార్డును సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లోడి భవాని విశ్వనాథం పేర్కొన్నారు. మాటలకంటే చేతలకు ప్రాధాన్యతనిస్తూ, వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పూర్తి బాధ్యతతో పనిచేస్తానని తెలిపారు.రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అన్ని విధాలా ప్రజలకు అండగా నిలుస్తానని భవాని విశ్వనాథం ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పార్టీ ఇంచార్జ్ విజయభాస్కర్ రెడ్డి, మామిడి రాజు, బొంతపల్లి శ్రీనివాస్, నాగరాజు, అనిల్, యాదగిరి తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.