జాతీయ క్రీడావేదికపై సిరిసిల్ల సత్తా చాటిన కడారి అశోక్ కుమార్
•మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో మూడు కాంస్య పతకాలు… జిల్లాకు గర్వకారణంగా నిలిచిన సిరిసిల్ల అథ్లెట్మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి02రాజన్న సిరిసిల్ల జిల్లా క్రీడారంగంలో మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. జిల్లాకు చెందిన అథ్లెట్ కడారి అశోక్ కుమార్ జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో అద్భుత ప్రతిభ కనబర్చి మూడు కాంస్య పతకాలు సాధించి జిల్లా ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో నిలబెట్టారు.రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్లో ఫిబ్రవరి 2న నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన,10 కిలోమీటర్ల రేస్, హై...