మౌనంగా విలపిస్తున్న కైలాసగిరి…గిరి ప్రదక్షిణకు న్యాయం ఎప్పుడు?

•మహాశివరాత్రి నాటికి మౌలికవసతులు కల్పించాలని డిమాండ్శ్రీకాళహస్తి,ఫిబ్రవరి7(మనప్రజాప్రతినిధి):పంచభూత క్షేత్రాల్లో వాయు తత్త్వానికి ప్రతీకగా వెలసిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి క్షేత్రాన్ని ఆవరిస్తూ విస్తరించిన సుమారు 22 కిలోమీటర్ల కైలాసగిరి పర్వత శ్రేణి అపారమైన ఆధ్యాత్మిక, పురాణ ప్రాముఖ్యత కలిగినా తగిన అభివృద్ధి లేక నిర్లక్ష్యానికి గురవుతోందని హిందూ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నా రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి పౌర్ణమి, ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ కోసం శ్రీకాళహస్తికి చేరుకుంటున్నప్పటికీ, ప్రదక్షిణ...