మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 12 సమ్మెలో పాల్గొందాం

– వ్యవసాయ కార్మిక సంఘంరాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.నర్సిములు పిలుపుసదాశివపేట,ఫిబ్రవరి5(మనప్రజాప్రతినిధి)కేంద్ర ప్రభుత్వం కార్మిక-కర్షక హక్కులను తొలగిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తున్నదని, ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. నర్సిములు పిలుపునిచ్చారు.సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి న అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు, కర్షకులపై ఆర్థిక భారం పెంచుతూ...