manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 2:17 pm Editor : Mana Praja Prathinidhi

ఘనంగా జాజ్వల్యంగా మహాశివరాత్రి వేడుకలు

భక్తుల తండోపతండాల రాకతో ఆధ్యాత్మిక ఉత్సాహంవెల్లివిరిసింది

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఫిబ్రవరి17
మర్పడగ గ్రామంలోని సంతాన మల్లికార్జున సమేత విజయదుర్గ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణలతో మార్మోగింది.ఆదివారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగగా, నాదీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం నిర్వహించిన పెద్దపట్నం, అగ్నిగుండం కార్యక్రమాలు భక్తుల్లో అపారమైన ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రేకెత్తించాయి.మర్పడగ, రాంపల్లి తదితర గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, కళాకారుల నృత్య ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అనంతరం వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి మహాశివరాత్రి వేడుకలను విజయవంతంగా ముగించారు