బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి: ఎమ్మెల్యే పల్లా పిలుపు
•చేర్యాలలో బీఆర్‌ఎస్ భారీ ఎన్నికల ర్యాలీ – ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల వివరాలుమనప్రజాప్రతినిధి//చేర్యాల.ఫిబ్రవరి10మున్సిపల్ వార్డు ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా చేర్యాల పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ నుండి నేతాజీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిపిఎం సిద్ధిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను...