manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 8:17 am Posted by : MANA PRAJA PRATINIDHI

మేళ్లచెరువులో భారీ మోసం

ప్రజాప్రతినిధి//మేళ్లచెరువు:

మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు ఉంటే రూ.10 లక్షలు ఇస్తామంటూ నమ్మించి దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ పరమేష్ సూచించారు. ప్రాసెసింగ్ ఫీజు పేరిట డబ్బులు వసూలు చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఏపీకే APK ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దని, ఇలాంటి మోసపూరిత కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.