మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 2: మున్సిపల్ ఎన్నికలవేళ నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 7వ వార్డు శాస్త్రి నగర్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ రామ్ మరియు అతని అనుచరులు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీని వీడి ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలోచేరిన వారికి మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.7వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయ బుజ్జి తనకు ఎటువంటి పదవి లేకున్న అనేక సామాజికసేవాకార్యక్రమాలునిర్వహించారని,మున్సిపాలిటీలోని కొన్ని వార్డులలో సొంత డబ్బులతో బెంచీలు ఏర్పాటు చేయడం, లక్షల రూపాయలు వెచ్చించి హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు అన్నారు.అలాంటి సేవా దృక్పధం కలిగిన యువకుడిని కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును బంజారా హిల్స్ లాగ మారుస్తాడు అన్నారు. విజయ్ ని మనందరం భారీ మెజారిటీతో గెలిపించాలి అన్నారు.పార్టీలో
చేరిన వారిలో రాజ్ కుమార్,సాయిలు, అంజయ్య,నర్సింలు, శ్రీనివాస్,ప్రవీణ్,దత్తు, రాము,కృష్ణ,విటల్ వారి అనుచరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్,మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు జగదీశ్వర చారి,మాజీ కౌన్సిలర్ అభిషేక్ షెట్కార్,వంశీరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు లాయక్, అంజయ్య, తదితరులు ఉన్నారు.