manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 11:12 am Editor : Mana Praja Prathinidhi

గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం: సర్పంచ్ మామిడి రాజు

మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి06:
ఇల్లంతకుంట గ్రామంలోని 11,12వ వార్డుల్లో స్థానిక సర్పంచ్ మామిడి రాజు వార్డు సభ్యులతో కలిసి పర్యటించి గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి తాగునీటి కొరత, డ్రైనేజీ సమస్యలు, రహదారుల దుస్థితి, పారిశుధ్య లోపాలు వంటి అంశాలను వారి నుంచి స్వయంగా తెలుసుకున్నారు.అలాగే గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ, ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ దశలవారీగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రేగుల కార్తీక్, చేరాల వంశీకృష్ణ, మామిడి శ్రీనివాస్, రాకం సుమన్, అంతటి శ్రీకాంత్ గౌడ్, కూనబోయిన రఘు, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు కొట్టె వెంకన్న, దేవయ్య, ఎర్రోజు రవితేజ, దుర్గయ్య, సురేష్, రమేష్, బాబు తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.