గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం: సర్పంచ్ మామిడి రాజు
మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి06:ఇల్లంతకుంట గ్రామంలోని 11,12వ వార్డుల్లో స్థానిక సర్పంచ్ మామిడి రాజు వార్డు సభ్యులతో కలిసి పర్యటించి గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి తాగునీటి కొరత, డ్రైనేజీ సమస్యలు, రహదారుల దుస్థితి, పారిశుధ్య లోపాలు వంటి అంశాలను వారి నుంచి స్వయంగా తెలుసుకున్నారు.అలాగే గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ, ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ దశలవారీగా పరిష్కారం చేస్తామని హామీ...