manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 4:58 pm Editor : Mana Praja Prathinidhi

మున్సిపల్ వైస్ చైర్మన్ చిరుకు ఘన సన్మానం-మెలిగిరిపేట సర్పంచ్ షాబుద్దీన్ అభినందనలు

సదాశివపేట,ఫిబ్రవరి17(మనప్రజాప్రతినిధి):
నూతనంగా ఎన్నికైన సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి ను మెలిగిరిపేట సర్పంచ్ షాబుద్దీన్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ షాబుద్దీన్ మాట్లాడుతూ, నేటి కాలంలో యువత రాజకీయాల్లోకి రావడం చాలాసంతోషకరమని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ చిరంజీవి సమాజసేవలో ముందుండి ప్రజలకు సేవలు అందిస్తున్నారని, భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మధుకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.